Monday, November 25, 2024

ఇక రైల్వే సిగ్నళ్లకు డబుల్ లాక్ ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కోరమండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన పరిణామంతో భారతీయ రైల్వేవిభాగం భద్రతవిషయంలో కీలక నిర్ణయంతీసుకుంది. అన్ని సిగ్నలింగ్ ఏర్పాట్లకు డబుల్ లాక్ ఏర్పాట్లు చేయాలని పాలకమండలి ఆదేశించింది. సిగ్నలింగ్ వ్యవస్థ లోపాలతో లేదా ఇతర కారణాలతో ఇటీవల ఒడిషాలో ఒకేచోట మూడు రైళ్లు ప్రమాదానికి గురై పెను విషాదానికి దారితీసింది. స్టేషన్ల వద్ద జంక్షన్లలోని కంట్రోలింగ్ ఏర్పాట్ల సంబంధిత రిలే రూమ్స్, సిగ్నలింగ్ హట్స్ హౌసింగ్ ఏర్పాట్ల వద్ద, లెవల్ క్రాసింగ్‌ల వద్ద, పాయింట్ , ట్రాక్ సిగ్నల్స్ వద్ద డబుల్ లాక్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ డబుల్ లాక్ సిస్టమ్ ఇతర విషయాలతో కూడిన ఆదేశాల సమాచారాన్ని అన్ని రైల్వేజోన్లకు పంపించారు. సిగ్నలింగ్ సంబంధిత రిలేరూంకు సరైన అనుసంధానం లేకపోవడం వల్లనే ఇటీవల సిగ్నలింగ్ సాంకేతిక లోపం జరిగి లేదా సిగ్నల్ చొరబాట్లు చోటుచేసుకుని ఈ నెల 2 నాటి ప్రమాదం జరిగి ఉంటుందని, బాలాసోర్ దుర్ఘటన ప్రాధమిక దర్యాప్తు క్రమంలో తేలింది.

దీనితో ముందస్తు జాగ్రత్త చర్యగా డబుల్ లాక్ ఏర్పాట్లకు రైల్వే మండలి పాలక వర్గం నిర్ణయం తీసుకుని తక్షణ ఆదేశాలకు దిగిందని వెల్లడైంది. సిగ్నల్స్‌ను ప్రభావితం చేస్తూ ఇంటర్‌లాకింగ్, లేదా సిగ్నలింగ్ చొరబాట్లు జరగడం వంటివి జరిగి ఉంటాయని, ఇదే ఘోర ప్రమాదానికి దారితీసిందని ప్రాధమికంగా తేలడంతో సిగ్నలింగ్ వ్యవస్థ ప్రభావితం కాకుండా చేసేందుకు డబుల్ లాకింగ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. ఇప్పటివరకూ ఉన్న ఏర్పాట్లలో సింగిల్ లాక్ కేవలం స్టేషన్ మాస్టర్ వద్ద ఉండటం, రైళ్ల రాకపోకల నియంత్రణ సంబంధిత సిగ్నలింగ్‌కు దీనిని వాడటం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News