న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు కొత్త చరిత్రను సృష్టించాయి. 10,000 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను రవాణా చేసి రైల్వేలు మైలు రాయిని అధిగమించాయని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ సోమవారం ప్రకటించారు. ఏప్రిల్ 19న ముంయిలో ప్రారంభమైన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ రవాణా ఇప్పుడు 10 రాష్ట్రాలకు విస్తరించినట్లు ఆయన తెలిపారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా సోమవారం ఉదయం 10 వేల టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను రవాణా చేసి మైలు రాయిని చేరుకున్నామని ఆయన తెలిపారు. 13 రాష్ట్రాలకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆక్సిజన్ రవాణా చేసినట్లు ఆయన చెప్పారు.
తౌక్టే తుపాను గుజరాత్ తీరాన్ని తాకనున్నదన్న ముందస్తు సమాచారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా 150 గన్నుల ఆక్సిజన్‌ను ఒకే రోజు ఆ రాష్ట్రం నుంచి రవాణా చేసినట్లు ఆయన చెప్పారు. గత 20 రోజులుగా సగటున రోజుకు 134 టన్నుల ఆక్సిజన్‌ను రవాణా చేయగా ఆదివారం నాడు 137 గన్నులు, సోమవారం 151 టన్నుల ఆక్సిజన్‌ను పశ్చిమ రైల్వే గుజరాత్ నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాలకు రవాణా చేసిందని శర్మ తెలిపారు. ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాను ఏప్రిల్ 25న ప్రారంభించిన పశ్చిమ రైల్వే రోజుకు సగటున 134 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నట్లు ఆయన వివరించారు.