Sunday, January 19, 2025

తెలుపు, నీలి రంగుల్లోనే రెండో వందే భారత్ రైలు

- Advertisement -
- Advertisement -

వారణాసి : వారణాసిన్యూఢిల్లీ రూటులో రెండో వందే భారత్ రైలును సోమవారం ప్రధాని మోడీ ప్రారంభించారు. మొదటి వందేభారత్ రైలు మాదిరి గానే ఇది కూడా ఉండడం విశేషం. అంతకు ముందు రోజు నార్తర్న్ రైల్వే జర్నలిస్టులకు పంపిణీ చేసిన బ్రోచర్లలో కాషాయం, బూడిద రంగుల్లో వందేభారత్ రైలు ఉన్నట్టు చూపించారు. “ ప్రస్తుతం తెలుపు , నీలి రంగుల్లో ఉన్న వందేభారత్ రైళ్లను భవిష్యత్తులో కాషాయం, బూడిద రంగుల్లో మార్చాలన్న ప్లాన్లు ఉన్నాయని, ఈ మేరకు కోచ్ ఫ్యాక్టరీల్లో తయారవుతున్నాయని , అదే ఉద్దేశంతో బ్రోచర్లలో కాషాయం రంగులో వందేభారత్ చూపించామని నార్తర్న్ రైల్వే సీనియర్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

వందేభారత్ రైళ్లలో ఉండే అత్యంత ఆధునిక సౌకర్యాలను ఆయన వివరించారు. వైఫై , జిపిఎస్ ఆధారిత సమాచార వ్యవస్థ, ప్లష్ ఇంటీరియర్స్, బయోవాక్యూమ్ టాయ్‌లెట్లు, టచ్‌ఫ్రీ సౌకర్యాలు గురించి పేర్కొన్నారు. సోమవారం ఈ రెండో వందే భారత్ రైలు వారణాసిలో మధ్యాహ్నం 2.45 కు బయలుదేరినప్పటికీ, మంగళవారం తప్ప మిగతా అన్ని రోజుల్లో ఉదయం 6 గంటలకే బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2.05 గంటలకు ఢిల్లీ చేరుతుంది. మళ్లీ వారణాసికి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11.05 గంటలకు గమ్యం చేరుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News