Monday, December 23, 2024

రాష్ట్రంలో 12 జిల్లాలకు భారీ వర్షాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాగల 48గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడా ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర ప్రదేశ్ మీద 3.1 కి.మి ఎత్తులో ఉ్నన ఉపరితల ఆవర్తనం గురువారం బలహీనపడినట్టు వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 4.5కి.మి నుండి 7.6కి.మి ఎత్తు మధ్య స్థిరంగా కొనసాగుతూ వస్తున్నట్టు తెలిపింది. దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ దిశనుండి తెలంగాణ రాష్ట్రంవైపు వీస్తున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవాకశాలు ఉన్నట్టు తెలిపింది.

అదిలాబాద్ , కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం , మహబూబాబాద్, సంగారెడ్డి ,మెదక్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గడిచిన 24గంటల్లో అశ్వారావు పేటలో 45.3 మి.మి వర్షం కురిసింది. మహాబూబ్ నగర్‌లో 39.5, సదాశివునిపాళెంలో 35.3, ఉడిట్యాల్‌లో 32.8, సీతారామపట్నంలో 32,గరిమెళ్లపాడులో 31, పార్‌పల్లిలో 30.5, వేంసూర్‌లో 30.3 ,దామరగిద్దలో 28.5, చిక్కాపూర్‌లో 25.5, మహబూబ్‌నగర్‌లో 27.8, పాతకొత్తగూడెంలో 27.5, బొమ్రాస్‌పేటలో 25.5,

గంగారంలో 25, కోటకొండలో 24.5, మద్దుకూరులో 24.3, వెంకులంలో 24.3, మల్కారంలో 24.3, నాగుపల్లిలో 24, బాలనగర్‌లో 23.8, అంకంపాళెంలో 22.8, నవీపేటలో 22.5, తొండకూర్‌లో 22 మి.మి చోప్పున వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని మరి కొన్ని ప్రాంతాల్లో కూడా తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News