Thursday, January 23, 2025

రాష్ట్రమంతటా విస్తరించిన ‘నైరుతి’

- Advertisement -
- Advertisement -

Congress Protest at Raj Bhavan against ED

రాష్ట్రమంతటా విస్తరించిన ‘నైరుతి’
రాగల మూడురోజులు పలు జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సగటు సముద్రమట్టానికి 0.9మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు అనేక చోట్ల కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. బుధవారం పలు జిల్లాలో భారీ వర్షాలు కురవగా గురువారం కూడా పలు జిల్లాలో కుండపోతగా వానలు కురిశాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
జీహెచ్‌ఎంసి పరిధిలో 168 వర్షాకాల అత్యవసర టీమ్‌లు
నైరుతి ప్రభావంతో హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షాలు మొదలయ్యాయి. వాతావరణ శాఖ నుంచి భారీ వర్ష సూచన హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రేటర్ పరిధిలోని మాదాపూర్, కూకట్ పల్లి, మేడ్చల్, సూరారం, హైదర్ నగర్, ప్రగతి నగర్, నిజాంపేట్, బాచుపల్లి, కొండాపూర్‌లో భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ హెచ్చరికలపై అప్రమత్తమైన జీహెచ్‌ఎంసి అధికారులు 168 వర్షాకాల అత్యవసర టీమ్‌లను ఏర్పాటు చేసి వారిని అలర్ట్‌గా ఉంచారు. వరద ముంపు, రోడ్లపై నీటి నిల్వ వంటి ఇబ్బందులు కలిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1912కు కాల్ చేయాలని అధికారులు నగరవాసులకు సూచించారు. వర్షం కురవడంతో చిరు వ్యాపారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రహదారులపై నిలిచిన నీటితో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
గురువారం రాష్ట్రవ్యాప్తంగా….
గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురవగా దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిర్మల్ జిల్లాలో 133 మిల్లీమీటర్లు, వరంగల్‌లో 125, జగిత్యాలలో 120, మంచిర్యాలలో 112, జయశంకర్ భూపాలపల్లిలో 110, పెద్దపల్లిలో 100, మహబూబాబాద్‌లో 91, భద్రాద్రి కొత్తగూడెంలో 91, రంగారెడ్డిలో 86, జయశంకర్ భూపాలపల్లిలో 83, కరీంనగర్‌లో 83, కామారెడ్డిలో 76, జనగాంలో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Rain Alert for next 3 days in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News