కోస్తాంధ్ర ప్రాంతాన్ని అనుకుని , తెలంగాణలో సగటు సముద్ర మట్టానికి 5.8కి.మి ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం గురువారం బలహీనపడింది. కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశనుండి తెలంగాణ వైపు వీస్తున్నాయి. వీటి ప్రభాంతో రాగల 24గంటలు రాష్ట్రంలో తేలిక పాటి నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలోని 13జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అదిలాబాద్ , కొమరం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ ,నిజామాబాద్ , జగిత్యాల,
రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి,వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఉరుములు, మెరుపులు ,గంటకు 40కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఈ నెల 24వరకూ రాష్ట్రంలో తేలికపాటి నుంచి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.