Wednesday, January 22, 2025

తెలంగాణకు భారీ వర్ష సూచన.. 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. బుదవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై మబ్బులు కుమ్ముకుంది. అక్కడక్కడ చిరుజిల్లులు కురుస్తున్నాయి.

ఇక, ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, బాపట్ల, కృష్ణా, పార్వతీపురం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News