- Advertisement -
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నాయి. తెలంగాణలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం వెల్లడించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో అల్పపీడనం కొనసాగుతుందని, విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీంతో రానున్న రెండు రోజులపాటు తెలంగాణలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.ఇక, ఆంధ్రప్రదేశ్ లోనూ పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Rain alert in Telangana for next 2 days
- Advertisement -