- Advertisement -
అమరావతి: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఎపిని ముంచెత్తుతున్నాయి. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఎపిలో భారీ వర్షాలు కురవనున్నాయని, నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈరోజు కూడా ఎపిలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు తెలిపారు.
Rain Alert to AP from Nov 26 to Dec 2nd
- Advertisement -