Sunday, January 19, 2025

తెలంగాణలో మూడు రోజుల్లో వానలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈరోజు ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజయనగరం, ఇస్లాంపూర్ వరకు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

నైరుతి రుతుపవనాల విస్తరణ నేపథ్యంలో మూడ్రోజుల పాటు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలలో వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News