Monday, December 23, 2024

ఏకధాటిగా వర్షం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : సోమవారం రాత్రి 10 గంటలకు మొదలైన భారీ వర్షం తెల్లవారుజామున 4 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. గత 50 ఏళ్ళలో కనివిని ఎరుగని రీతిలో వర్షపాతం నమోదైంది. రాష్ట్ర స్థాయిలోనే వేల్పూరులో అత్యధిక వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజుల పాటు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశాయి. ఈమేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు తదుపరి చర్యలపై కార్యాచరణను రూపొందించారు.

హుటాహుటిన జిల్లాకు వచ్చిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి సహాయక చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం రాత్రి నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరులో 463.05, ఆర్మూర్‌లోని పెర్కిట్‌లో 331, భీంగల్ మండల కేంద్రంలో 264, కమ్మర్‌పల్లిలోని కొనసముందర్‌లో 226.5, జక్రాన్‌పల్లిలో 222, డిచ్‌పల్లి మండలం కోరట్‌పల్లిలో 172, మోర్తాడ్ మండల కేంద్రంలో 112 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 85 మీల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News