Wednesday, December 25, 2024

రెయిన్ బో బిడ్డకు జన్మనివ్వబోతున్నాను: మ్యాక్స్‌వెల్ భార్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఆర్‌సిబి ఆటగాడు, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, భార్య వినీ రత్నమ్ దంపతులు బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మ్యాక్స్‌వెల్ భార్య వినీ రామన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ డ్రెస్‌తో పాటు స్కానింగ్ రిపోర్ట్‌ను షేర్ చేసింది. 2022లో చెన్నైకు చెందిన వినీ రామన్‌ను మ్యాక్స్‌వెల్ వివాహం చేసుకున్నాడు. ఐపిఎల్ 2023లో ఆర్‌సిబి తరపున మ్యాక్సీ అడుతున్నాడు.

వినీ తన భర్తతో పాటు ఇండియాలో ఉంటుంది. ఇటు ఐపిఎల్, అటు ఆస్ట్రేలియా టీమ్ తో కలిసి ఈ సంవత్సరం  మ్యాక్స్ బిజీగా గడుపుతున్నాడు. రెయిన్ బో బేబీకి సెప్టెంబర్‌లో జన్మ ఇవ్వబోతున్నానని, చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. తన జీవిత ప్రయాణం అంత తేలికగా సాగలేదని, ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్లే ఎక్కువగా ఉంటారని పోస్టు చేసింది. సంతానం లేని దంపతులకు తన ప్రేమను తెలియజేస్తున్నానని వివరించింది. గర్భస్రావం లేదా ఇతర కారణాలతో తల్లి కడుపులోనే బేబీ మృతి చెందింతే రెయిన్‌బో అని అంటారు.

 

https://www.instagram.com/vini.raman/?utm_source=ig_embed&ig_rid=5b00902b-0fb9-4f64-ad08-085aceea6ebf

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News