Wednesday, January 22, 2025

స్తంభించిన ఢిల్లీ… దశాబ్దం లోనే రికార్డుస్థాయిలో వర్షం

- Advertisement -
- Advertisement -

Rain continues in Delhi

న్యూఢిల్లీ : శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా ఢిల్లీలో కురుస్తున్న వర్షాలకు నగర వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ స్తంభించి పోయింది. సాధారణంగా అక్టోబరులో ఢిల్లీలో ఈ స్థాయిలో వర్షాలు కురవడం చాలా అరుదు. శీతాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో అక్కడ ఏటా గాలి నాణ్యత క్షీణించడం మొదలవుతుంది. శివారు ప్రాంతాల్లో పంట వ్యర్ధాల దహనం కూడా ఇదే నెల నుంచి ఆరంభిస్తారు. అయితే తాజాగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల గాలి నాణ్యత కొంత మెరుగవుతుందని వాతావరణ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత 24 గంటల్లో ఢిల్లీలో కురిసిన వర్షపాతం రికార్డు నెలకొల్పిందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఉపాధ్యక్షుడు మహేశ్ పలావట్ తెలిపారు. గత దశాబ్ద కాలంలో ఢిల్లీలో అక్టోబరులో ఈ స్థాయి వర్షాలు ఎప్పుడూ కురవలేదన్నారు. శనివారం నుంచి ఇప్పటివరకు 74 ఎంఎం వర్షపాతం నమోదైందన్నారు. ఉష్ణోగ్రతలు సైతం 10 డిగ్రీల మేర పడిపోయాయన్నారు. సోమవారం నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయన్నారు. ఢిల్లీతోపాటు శివారు ప్రాంతాల్లోని ఫరీదాబాద్, గురుగ్రామ్, నోయిడా లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News