Monday, December 23, 2024

వర్ష బీభత్సం…కారులో విమానాశ్రయానికి వెళుతూ తండ్రీ కూతురు గల్లంతు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వాతావరణ శాఖ రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. వరద పోటెత్తడంతో అనేక గ్రామాలు నీట మునిగాయి. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలోనైతే 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 29 సెమీ. వర్షపాతం నమోదయింది. నాలుగు అడుగుల మేర వరద నీళ్లు నిలిచాయి. నున్న ప్రాంతంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇళ్లు నీట మునిగాయి.

నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎక్కమేడు గ్రామంలో ఇల్లు కూలి తల్లి, కూతురు మృతి చెందారు. ఇక కోదాడలో పోలీసులు ఓ మృతదేహాన్ని గుర్తించారు. నిన్న రాత్రి కురిసిన వానకు రెండు కార్లు కొట్టుకుపోయాయి. ఆ కార్లను కూడా పోలీసులు వెలికి తీశారు. కారులో వ్యక్తి మృత దేహాన్ని కూడా వెలికి తీశారు. ఖమ్మంలో గల్లంతైన నన్నే బోయిన పద్మావతి(34) అనే మహిళ మృత దేహం లభ్యమైంది.

మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది, ఆ సమయంలో కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు … వరద ప్రవాహంలో గల్లంతయ్యారు…  పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అదుపుతప్పి నీటిలోకి కారు కొట్టుకుపోయింది.. అయితే.. తమ కారు వాగులోకి పోయిందని, తమ మెడవరకు నీరు వచ్చిందంటూ బంధువులకు నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్విని ఫొన్ చేశారు.

ప్రస్తుతం వారి ఫోన్ లు స్విచ్చాఫ్ రావడం, కారు కూడా కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందతున్నారు. పోలీసులు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News