Monday, April 7, 2025

పలు రాష్ర్టాలలో వర్ష సూచన

- Advertisement -
- Advertisement -

rain forecast

న్యూఢిల్లీ : రానున్న ఐదు రోజుల పాటు కోస్తాంధ్ర, దక్షిణ కర్ణాటక, కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండి) శుక్రవారం విడుదల చేసిన వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. బీహార్, జార్ఖండ్, ఒడిశా,తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండి పేర్కొంది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో వేడిగాలలు  పరిస్థితులుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో శుక్రవారం తేలికపాటి వర్షంతో పాటు పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ విభాగం సూచించింది. అరేబియా సముద్రం నుంచి రుతుపవనాల పశ్చిమ గాలుల ప్రభావంతో కోస్తాంధ్ర, దక్షిణ కర్ణాటక, కేరళ, లక్షద్వీప్‌లలో రాబోయే ఐదు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కార్యాలయం అంచనా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News