Sunday, January 19, 2025

రాష్ట్రంలో రాగల రెండు రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

రాగల రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.తెలంగాణ నుంచి మధ్య బంగాళాఖాతంలోని ప్రాంతాల వరకు కొనసాగిన ద్రోణి శుక్రవారం రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ మధ్యలో కొనసాగుతుంది. గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

శుక్రవారం మెదక్ జిల్లాలో వడగాళ్ల వాన కురిసినట్లు అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసినట్లు తెలిపారు. శనివారం రాష్ట్రంలోని నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట,జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అదే విధంగా ఆదివారం నిజామబాద్, రాజన్న సిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి, ములుగు, భదాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News