Monday, December 23, 2024

తొంగిచూసిన తొలకరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత తో సతమతమవుతున్న ప్రజలకు ఒక్కసారిగా వాతావరణం లో వచ్చిన మార్పుతో కొంత ఉపశమనం కలిగింది. ఆదివా రం సాయంత్రం సమయానికి హైదరాబాద్‌లోని పలు ప్రాం తాలతో పాటు పలు జిలాల్లోనూ ఈదురు గాలులతోపాటు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ ప్రభావంతో ఇండ్ల పైకప్పులు లేచిపోగా, విద్యుత్ లైన్లు తెగిపడి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. నైరుతి రుతు పవనాల ప్రభా వం ఈ నెల 4, 5వ తేదీల నుంచి రాష్ట్రంపై కనిపిస్తుందని వా తావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే రెండు రో జులు ముందుగానే వాతావరణంలో మార్పు రావడంతో ఇక వర్షాలు మొదలైనట్లేనని భావిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలో ఓ మోస్తారు వర్షం కురిసింది. నగరంలోని ఉప్పల్, రామంతపూర్, చిలుక నగర్, సికింద్రాబాద్, చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగ ర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, బోరబండ, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్, ట్యాంక్‌బండ్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొమురం భీం ఆ సిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని మొఖాసిగూడ గ్రా మంలో భారీగా ఈదురు గాలులు వీ చాయి. దీంతో పలు ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భా రీ వృక్షం విరిగిపడింది. ఉ రుములు, మెరుపులతో కూడిన వ ర్షం మొదలైంది. ఎండవేడి మి, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైన ప్ర జలకు కొంత ఉపశమనం లభించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఈదురు గాలులు పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల పిడుగు పాటుకు చెట్లు నేలరాలాయి అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆదిలాబాద్ జిల్లాలో తొలకరి పలకరించింది. బజార్ హత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ తదితర మండలాల్లో వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో ఒక్క సారిగా వాతావరణం మారి పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మందమర్రి, ధర్మపురి, కమలాపూర్, కరీంనగర్, చెన్నూరు, పెద్దపల్లి, సిర్పూర్, కాగజ్‌నగర్, షాద్‌నగర్, మోత్కూరు, వలిగొండ, భువనగిరిలో ఒక మోస్తరు వర్షం పడింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జూన్ 4 వరకు ఇతర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

వాతావరణ శాఖ అంచనా ప్రకారం జూన్ 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉండగా రెండు రోజులు ముందుగానే రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. నగరంలోని అన్ని మండలాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో అక్కడకక్కడా ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. సోమవారం భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని వెల్లడించింది. 50- నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులను అలెర్ట్ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

అప్రమత్తమైన జిహెచ్‌ఎంసి
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి జిహెచ్‌ఎంసి ముందుగానే అప్రమత్తమైంది. భారీ వర్ష సూచన నేపథ్యంలో జిహెచ్‌ఎంసి అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, ఆయా విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో సిద్దంగా ఉంచింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలకుండగా, రోడ్లపై నీళ్లు నిలిచిపోకుండా, చెట్లు, హోర్డింగ్స్ కూలిపోతే వెంటనే తొలగించేలా అధికారులు సమాయత్తం అయ్యారు. మరోవైపు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా బల్దియా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రజలు తమ తమ ప్రాంతాల్లో ఏమైనా సమస్యలుంటే వెంటనే 040-21111111, 9000113667 నెంబర్లకు కాల్ చేసి సమాచారం తెలియజేయాల్సిందిగా అధికారులు తెలిపారు.

ఏపిని తాకిన రుతుపవనాలు
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి చల్లని వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించి, సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా కూడా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. తొలుత జూన్ 4,-5 తేదీల్లో రుతుపవనాలు ఏపీని తాకుతాయని భావించగా ముందుగానే రుతుపవనాలు ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశించాయి. దీంతో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు వేగంగా విస్తరించి రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు తీవ్ర రూపం దాలుస్తాయని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News