Friday, December 20, 2024

రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్రమట్టానికి 0.9కి.మి ఎత్తువద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని దిని ప్రభావంతో రాగల రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు , మెరుపులతోపాటు గంటకు 40కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ,మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకంటే తక్కువకు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News