వణుకుతున్న నగరవాసులు
హైదరాబాద్: నగరవాసులకు వాన గండం పొంచి ఉంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపడంతోనగరవాసులు బిక్కు బిక్కుమంటున్నారు. బుధవారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటీకే నీట మునిగిన కాలనీలు, బస్తీ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత 9 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని అన్ని చెరువులు, కుంటలు, నిండు కుండలను తలపిస్తుండగా, నాలాలు ఇప్పటీక ఉధృతంగానే ప్రవహిస్తుండడగా మ్యాన్‌హోల్స్, డ్రైనేజీలు పొంగి పోర్లుతునే ఉన్నాయి. దీంతో నగరంలో చినుకులు పడితే చాలు భయాందోళనలకు గురవుతున్నారు.
మరోవైపు జంట జలాశయాలైన గండిపేటలో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుండగా హిమాయత్ సాగర్‌లో పూర్తిస్థాయి మట్టానికి చేరుకోవడంతో మూడు గేట్లను ఓ అడుగు మేర లేపి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో మూసి పరివాహక ప్రాంతా ప్రజల్లో అందోళన నెలకొంది. ఈ సమయంలో భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఏమిటాన్ని భయాందోళనల్లో ఉన్నారు. అదేవిధంగా ఇప్పటీకే పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువులు , కుంటలు దిగువ ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకోవడం, చాలా కాలనీలు ఇప్పటీకే వరద ముంపులోనే ఉన్నాయి. ఇదే క్రమంలో మళ్లీ వర్షాలు కురిస్తే నగరంలోని మరిన్ని చెరువులు, కుంటలు ఆలుగులు పారే అవకాశం ఉంది. ఇదే జరిగితే వేలాది కాలనీలు వరద ముంపుకు గురైయే ప్రమాదం ఉండడంతో లొతట్టు ప్రాంతాల వాసులు చిగురుటాకుల వణికిపోతున్నారు.