Monday, December 23, 2024

రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం పలు చోట్ల భారీ వర్షలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించింది. ఉత్తరకోస్తాంధ్ర మీద ఉన్న ఆవర్తనం శనివారం నాటికి బలహీన పడింది. వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల్లో సగటు సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఒక ఆవర్తనం ఏర్పడి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశవైపుగా వంగి ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఈ ఆవర్తనం రాగల రెండు మూడు రోజల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉన్న ఉత్తర ఒడిశా దాని పరిసరాల్లోని పశ్చిమ బెంగాల్ ,ఝార్కండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 18నాటికి మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించారు. దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ దిశ వైపు నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 46 మి.మి వర్షపాతం నమోదైంది. మిగిలిన మరికొన్ని ప్రంతాల్లో కూడా వర్షం కురిసింది. మెట్‌పల్లిలో 39, దౌల్తాబాద్‌లో 27, కోరుట్లలో 26, వడ్డేపల్లిలో 20, కూబీర్‌లో 19.3, కత్లాపూర్‌లో 18, కడ్డం పేద్దూర్‌లో 16 మి.మి వర్షం కురిసింది. రాష్ట్రంలోని మరి కొన్ని ప్రాంతాల్లో కూడా తేలిక పాటి వర్షాలు కురిశాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News