- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో రాగల మూడ్రోజుల పాటు వర్షం కురిసే అవకాముందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఒకటి, రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం పడే అవకాశముందని తెలిపింది. గాలివేగం గంటకు 30 నుంచి 40కి.మీ ఉంటుందని తెలిపింది. నైరుతి మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ ఇంటీరియర్ కర్నాటక మీదగా కర్నాటక తీరం వరకు ఉపరితల ద్రోణి ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ప్రభావం ఉండనుందని అధికారులు పేర్కొన్నారు.
Rain forecast for Telangana for three days
- Advertisement -