Wednesday, January 22, 2025

తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన

- Advertisement -
- Advertisement -

Rain forecast for Telangana for three days

హైదరాబాద్: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. రాష్ట్రంలో ఎల్లుండి అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. రానున్న రెండ్రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశముందని స్పష్టం చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో గత రెండ్రుజుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో నిన్న సాయంత్రం నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. భారీగా వర్షాలు పడే అవకాశమున్నందున లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమంత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News