- Advertisement -
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజులు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాలతో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అండమాన్ దగ్గరలో కేంద్రీకృతమైన అల్పపీడనం సోమవారం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణవ్యాప్తంగా గత రెండు మూడ్రోజులుగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతంలో మెరుపులతో పాటు చినుకులు కూడా కనిపించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా ఉదయం పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వాళ్లు బిక్కుబిక్కుమంటున్నారు.
- Advertisement -