- Advertisement -
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం దంచికొట్టింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, ఈదురు గాలులు వీచాయి. సురారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, కెపిహెచ్ బి కాలనీ, వివేకానంద నగర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
- Advertisement -