Sunday, December 22, 2024

భారీ వర్షానికి హైదరాబాద్ నగరం గజగజ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఎండలకు మండిపోయిన నగరం ఈ వర్షానికి చల్లబడింది. దీంతో నగర వాసులు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం లభించింది. నగరంలోని పంజాగుట్ట, ఫిలింనగర్, అమీర్ పేట్, మెహిదీపట్నం, టోలిచౌకి, గచ్చిబౌలి గోల్కొండ, కోఠి, ఉప్పల్, ఖైరాతాబాద్, ఎర్రగట్ట, కూకట్‌పల్లి, నిజాంపేట, కేపీహెచ్‌బీ, లిగంపల్లి, కొండాపూర్‌,మియాపూర్‌, సికింద్రాబాద్‌, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, ప్యారడైజ్‌, మారేడ్‌పల్లి, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, పేట్‌బషీరాబాద్‌ మేడ్చల్‌ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోయింది. వర్షం ధాటికి నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News