- Advertisement -
హైదరాబాద్: గత నాలుగు రోజులుగా నగరాన్ని వరుణుడు వెంటాడుతున్నాడు. శనివారం కూడా నగరంలో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీందో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూకట్ పల్లి, కేపిహెచ్ బి, హైదర్ నగర్, కోఠి, బషీరాబాద్, నారాయణగూడ, అఫ్జల్ గంజ్ ఆల్విన్ కాలనీ, మూసాపేట, ప్రగతినగర్, నిజాంపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్ లో వాన పడుతోంది. అటు తెలంగాణలో పలు జిల్లాలో వర్షం దంచికోడుతోంది. మహబూబ్ నగర్ లో గత రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.
- Advertisement -