Wednesday, January 22, 2025

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం దంచి కొడుతోంది. నగరంలోని కూకట్ పల్లి, హైదర్ నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, మూసాపేట్, బాచుపల్లి, కెపిహెచ్ బి కాలనీ, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, సురారం, షాపూర్ నగర్, చింతల్, జగద్దిరిగుట్ట, మాల్కాజ్ గిరి పరిసర ప్రాంతాల్లో వర్షం కుమ్మేస్తోంది.

వర్షం వల్ల రోడ్డలపై భారీగా నీరు నిలిచింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మళ్లీ వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News