Sunday, January 19, 2025

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో : మంగళవారం రాత్రి నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురువగా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడింది. మధ్యాహ్నం వరకు పొడి గా ఉన్న వాతావరణం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పూర్తి చల్లబడింది. ఆ తర్వాత నగరంలో అక్కడక్కడ చిరు జల్లులతో మొదలైన వర్షం రాత్రి 9 గంటల తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలని జలమయం అయ్యాయి.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, బాలానగర్ , బేగంపేట్ సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ. నాచారం, ఎ.ఎస్‌రావు నగర్, కుషాయిగూడ, ఉప్పల్ నాగోల్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, చార్మినార్, చంద్రాయణ్‌గుట్ట, నాంపల్లి, లక్డికాపూల్, మెహిదిపట్నం, లంగర్ హౌజ్, రాజేంద్రనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీవర్షం కారణంగా అక్కడక్కడ రోడ్లపై నీరు చేరడంతో ప్రయాణికులు రాత్రివేళ ఇంటికి చేరుకుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడడంతో వర్షంలోన తడిసి ముద్దయ్యారు. వర్షం నేపథ్యంలో జిహెచ్‌ఎంసి అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ సహాయక బృందాలను మోహరించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో ఎప్పటీకప్పుడు పర్యవేక్షిస్తున్న ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మరోవైపు డిఆర్‌ఎఫ్ బృందాలు సైతం సహాయక చర్యలో నిమగ్నమైయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News