Monday, December 23, 2024

నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం…

- Advertisement -
- Advertisement -

పాతబస్తీలో పలు చోట్ల రోడ్లు జలమయం

మన తెలంగాణ/హైదరాబాద్:  నగరంలో మధ్యాహ్నం ఎండ తీవ్రత కనిపించగా సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పు కనిపించింది. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, బేగంపేట్, తార్నాక, ఉప్పల్, హిమాయత్ నగర్, ఎల్బీనగర్,దిల్‌షుక్‌నగర్, వనస్దలిపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరోవైపు రానున్న రెండు గంటల్లో మిగతా ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కామారెడ్డి, జగిత్యాల, మెదక్, మేడ్చల్, మహబూబ్ నగర్, నారాయణ పేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట వికారాబాద్ జిల్లాల్లో వాన పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News