Sunday, January 19, 2025

ఇండియా- కివీస్ సెమీస్ మ్యాచ్ కి వర్షం అడ్డుపడితే?

- Advertisement -
- Advertisement -

ఇండియా- కివీస్ సెమీస్ మ్యాచ్ కోసం ముంబయి వాంఖడే సిద్ధమవుతోంది. అయితే మ్యాచ్ జరుగుతుండగా వర్షం పడితే? ఇప్పుడు అభిమానులందరినీ కలవరపరుస్తున్న సందేహం ఇదే. నిజానికి  సెమీపైనల్, ఫైనల్ మ్యాచ్ లకు రిజర్వ్ డేను కేటాయించారు. ఏ కారణంగానైనా మ్యాచ్ ఆగిపోతే, రిజర్వ్ డే నాడు మ్యాచ్ జరుగుతుంది. పోటీ మధ్యలో వర్షం పడితే, మిగతా మ్యాచ్ ను మరుసటి రోజు జరుపుతారు. రెండోరోజు కూడా వర్షం పడితే, ఓవర్లను కుదించి మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. ఇక రెండు రోజులూ మ్యాచ్ జరగకపోతే, పాయింట్లు ఎక్కువగా ఉన్న జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది.

ఇండియా- న్యూజీలాండ్ మధ్య జరిగే సమీఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాంఖడే స్టేడియంలోని పిచ్ ను రాహుల్ ద్రవిడ్ పరిశీలించాడు. కాగా ఓటమన్నదే లేని ఇండియాను ఎదుర్కునేందుకు కివీస్ వ్యూహాలు రచిస్తోంది. ఇండియాలో పిచ్ ల గురించి తమకు బాగానే తెలుసునని, పటిష్ఠంగా ఉన్న భారత జట్టును ఎదుర్కునేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ఆ జట్టు బ్యాటర్ కాన్వే అన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News