Friday, December 20, 2024

హైదరాబాద్‌లో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం వర్షం పడింది. పంజాగుట్ట, అమీర్ పేట్, బేగంపేట్, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, సికింద్రాబాద్, తార్నాక, లాలాపేట్‌, నాచారం, హబ్సిగూడ, ఉప్పల్‌, బోడుప్పల్‌, పీర్జాదిగూడ, మేడిపల్లి, మల్లాపూర్‌, బహదూర్‌పల్లి, సూరారంలో వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సోమవారం సాయంత్రం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడింది. ప్రస్తుతం బంగాళఖాతం అల్పపీడనం ఏర్పడటంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News