Saturday, April 20, 2024

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -
- Advertisement -

Rain

 

హైదరాబాద్ : హైదరాబాద్‌లో రోజు రోజూకూ చలి తీవ్రత పెరుగుతోంది. దీనికి తోడు పగటి పూట కూడా వాతావరణం చల్లగా మారిపోయి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో మరోసారి వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. ఓ వైపు చలి, మరో వైపు వర్షంతో హైదరాబాద్ వాసులు వణుకుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లిన వారు చల్లటి వాతావరణంతో ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతోనే పలు చోట్ల వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Rain in several parts of Hyderabad city
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News