Friday, December 27, 2024

నేడు పలు జిల్లాల్లో వానలు పడే అవకాశముంది

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాలలో గత రెండు మూడు రోజులుగా వాతావరణం చల్లబడింది. నేడు కూడా వానలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో ఈ సంవత్సరం ఎండలు దంచికొడుతున్నాయి. తమిళనాడులో ఏర్పడిన ద్రోణి ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ అధికారులు వెల్లడించారు. నేడు, రేపు కూడా రాష్ట్రంలో వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వారు తెలిపారు. మే 13 వరకు తెలంగాణలో వానలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. కాగా ద్రోణి ప్రభావం కారణంగా నేడు (మే 10) పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురియొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిమీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News