Monday, January 20, 2025

పొంచివున్న అల్పపీడనం

- Advertisement -
- Advertisement -

Rain in Telangana for next 3 days

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం పొంచివుంది. దీని ప్రభావంతో పలుప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి జడివాన కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసరప్రాంతాల్లో కొనసాగుతూ సముద్రమట్టానికి 3.1కిలోమీటర్ల ఎత్తువరకూ విస్తరించి ఉందని తెలిపింది. ఈ ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 48గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ ఈ నెల 22తేది ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత ఇది క్రమంగా బలపడుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కిందిస్థాయి గాలులు ముఖ్యంగా తూర్పు దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి. రాగల మూడురోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుమలు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Rain in Telangana for next 3 days

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News