Thursday, April 3, 2025

తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.ఇక, ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురుస్తాయని ఎపి వాతావరణ శాఖ చెప్పింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News