Tuesday, December 24, 2024

నగరంలో వర్ష బీభత్సం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: కుండ పోత వర్షం భాగ్యనగర వాసులను బెంబేలెత్తించింది. సోమవారం రాత్రి ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టి వర్షంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్భందనమైయ్యాయి.. ఒకవైపు కుండ పోత వర్షం మరో వైపు భారీ ఈదురు గాలులకు ఉరుములు, మెరుపులు కూడా తోడు కావడంతో నగవవాసులను వణికిపోయ్యారు. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్డ్ ప్రకటించడంతో మరింత భయాందోళనలకు గురైయ్యారు. గంట వ్యవదిలోనే పలు ప్రాంతాల్లో 5 నుంచి 7 సె.మి. మేర వర్షం కురిసింది. దీంతో మెట్రో రైలు వంతెన పలు చోట్ల జలపాతాలను తలపించాయి. వర్షం దాటికి కాలనీలు, రోడ్లలన్ని పూర్తిగా నదులు మారాయి. దీంతో పలు ప్రాంతాల్లో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్థభించిపోయింది. రామచంద్రాపురం, శేరిలింగంపల్లి, గాజుల రామారం, కూకట్‌పల్లి, జీడిమెట్ల సర్కిళ్ల పరిధిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

దీంతో వందలాది కాలనీలు బస్తీలు పూర్తిగా నీటమునిగాయి. . దీంతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడ పూర్తిగా స్థంభించిపోయింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అంధకారం నెలకొంది.. భారీ వర్షం దాటికి పలు చోట్ల వృక్షాలు నేల కూలాయి. ఆర్‌సిపురంలో 7. సె.మి, గచ్చిబౌలి 5.7, గాజుల రామారం ఉషోదయ కాలనీ 5.4, హెచ్‌ఎండి హిల్స్ 4.7, జీడిమెట్ల 4.6, కెపిహెచ్‌బి 3.8, సెంట్రల్ యూనివర్సీటి3.5, లింగంపల్లి 3.3, మల్కాజ్‌గిరి2.5, కుషాయిగూడ 2.4, ఆనంద్‌బాగ్ 2 సె.మి. మేర వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. లొతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఈదుర గాలులకు భాగమతి బోట్ ముందుకు 

హూస్సెన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో వీచిన బారీ ఈదురగాలులతో హూస్సెన్‌సాగర్‌లో భారీగా ఆలలు ఎగిసిపడ్డాయి. ఈ ఆలలకు ఈదుర గాలి తోడు కావడంతో భాగమతి బోట్ కొద్ది దూరం కొట్టుకుపోయింది. ఈ సమయంలో బోట్‌లో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వారందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

జిహెచ్‌ఎంసి అలర్ట్ 
నగరంలో ఆకస్మికంగా భారీ వర్షం కురవడంతో జిహెచ్‌ఎంసి అప్రమత్తమైంది. భారీ వర్షం కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కల్గినా వెంటనే జిహెచ్‌ఎంసి హెల్ప్ సెంటర్ 040-21111111 నంబర్‌కు కాల్ చేయాల్సిందిగా నగరవాసులకు సూచించారు. అత్యవసర సహాయక బృందాలు క్షేత్రస్థాయిలో ఉండి తక్షణ సహాయ చర్యలు అందించేలా చూడాలని అధికారులను అదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News