Friday, November 15, 2024

నగరంలో వర్షం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో వర్షం దంచికొట్టింది. ఆదివారం సాయంత్రం మరోసారి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గ్రేటర్‌లో పలు ప్రాంతాల్లో భారీ ఈదురగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినట్లుగానే పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదుర గాలులు నగవాసులను మరోసారి భయపెట్టాయి. శనివారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షం నుంచి నగరవాసులు ఇంకాతేరుకోకముందే మరోసారి వర్షం పడడంతో నగరవాసులు భయాందోళనాలకు గురైయ్యారు. ఎండ కాలంలో అడప దడప వర్షం పడడం మామాలే అయినా ఈ సారి మాత్రం నిండు వేసవిలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సిటీ జనులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

ఉరుములు, మెరుపులు భారీ ఈదురగాలులతో కూడిన కుండపోత వర్షం కురుస్తుండడంతో బిక్కుబిక్కుమంటున్నారు. జీడిమెట్ల, గాజుల రామారం, కుత్భుల్లాపూర్, కూకట్‌పల్లి సర్కిళ్లలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురువగా, బొల్లారం, అల్వాల్ , కాప్రా, చర్లపల్లి, కుషాయిగూడ, నేరెడ్‌మెట్, మల్కాజ్‌గిరి, తిరుమల్‌గిరి, సికింద్రాబాద్, తార్నాక, మల్లాపూర్, హబ్సిగూడ, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే ఇంకా మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

జిహెచ్‌ఎంసి అప్రమత్తం 

నగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో నగరవాసులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం సాయంత్రం జోనల్ కమిషనర్తలో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన మేయర్ వర్ష ప్రభావిత ప్రాంతాలతో పాటు లొతట్టు ప్రాంతా ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా రోడ్లపై నిలిచే వరద నీరును వెంట వెంటనే తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు కల్గకుండా చూడాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News