- Advertisement -
ఎనిమిది జిల్లాలకు ఆరేంజ్ అలెర్ట్
తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాలు కురుస్తుండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండి) బుధవారం రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఆస్తి నష్టం, రోడ్లపై నీరు నిలిచిపోవడం, అనేక ఎకరాల్లో వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయి. కేంద్ర జల సంఘం (CWC) దక్షిణాది రాష్ట్రంలోని వివిధ నదుల మట్టాలు ప్రమాదకరమైన స్థాయికి చేరాయని హెచ్చరిక జారీ చేసింది.
కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్ , కాసర్‌గోడ్ జిల్లాల్లో ఐఎండి ఆరెంజ్ అలర్ట్‌లు ప్రకటించింది. రాష్ట్రంలోని మిగిలిన ఆరు జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
#WATCH Kerala: Rain lashes parts of Malappuram. pic.twitter.com/rze5camKez
— ANI (@ANI) September 12, 2020
- Advertisement -