హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాలో వర్షం పడుతోంది. గత రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో బుధవారం ఉదయం 10 వరకు వాతావరణం చల్లగా ఉంది. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ తోని బంజారాహిల్స్, అమీర్ పేట్, కొండాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, చందానర్, మియాపూర్, మెహిదీపట్నం, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, హైటెక్ సిటీ, కోఠి, మలక్ పేట్, టోలీచౌకి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అటు నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించక ముందే వాటి ప్రభావంతో కురుస్తున్నాయి. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పడమటి గాలులు బలంగా వీస్తున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కేరళ తీరం మీదుగా దట్టమైన మబ్బులు కమ్ముకుని ఉంటున్నాయని, ఆగ్నేయ ఆరేబియా సముద్రంపై కూడా మబ్బులు కమ్మాయని ఐఎండి తెలిపింది. రాగల 24 గంటల్లో కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Rain lashes many parts of Hyderabad