- Advertisement -
ఢిల్లీ వాసులకు వడగాల్పుల నుంచి ఊరట
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం వానలు పడ్డాయి. అక్కడి జనాలు ఇన్నాళ్లు పడ్డ ఎండ తాపం నుంచి ఉపశమనం పొందారు. ఢిల్లీ కనిష్ఠ ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడింది. దీంతో ఈ సీజనులో మొదటిసారి సాధారణ ఉష్ణోగ్రత చోటుచేసుకుందని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీలో శనివారం, ఆదివారం కూడా మబ్బులు పట్టిన ఆకాశం(క్లౌడీ కండీషన్స్) ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ ఉండనుంది. ఇక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ‘మోడరేట్’ గా ఉండనున్నది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) ప్రకారం 0-50 వరకు ఉంటే ‘గుడ్’, 51-100 వరకు ఉంటే ‘సాటిస్ఫాక్టరీ’, 101-200 వరకు ఉంటే ‘మోడరేట్’, 201-300 వరకు ఉంటే ‘పూర్’, 401 నుంచి 500 వరకు ఉంటే ‘సీవియర్’ గా భావిస్తారు.
- Advertisement -