Wednesday, January 29, 2025

పివిఆర్ మల్టీప్లెక్స్ సీలింగ్ పైకప్పు నుంచి పడిన వర్షపు నీరు.. కల్కి సినిమా నిలిపివేత

- Advertisement -
- Advertisement -

హైదారాబాద్ : పంజాగుట్ట పివిఆర్ మల్టీప్లెక్స్ లో పైకప్పు నుంచి వర్షపు నీరు పడింది. ఆదివారం రాత్రి కల్కి సినిమా చూస్తుండగా సీలింగ్ పైకప్పు నుంచి వర్షపు నీరు పడడంతో సినిమాకు అంతరాయం ఏర్పడింది. దీంతో సినిమాను మధ్యలోనే థియేటర్ యాజమాన్యం నిలిపివేశారు. దీంతో థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంపై ప్రేక్షకుల ఆగ్రహం వ్యక్తం చేశారు.   గ్రేటర్ హైదరాబాద్‌ నగరంలో ఆదివారం రాత్రి పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురవడంతో పలు చోట్ల ప్రధాన రహదారులు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికిందరాబాద్ ప్రాంతంలో రోడ్లపైకి మోకాటిలోతు నీరు చేరింది. నగరంలోని పలు చోట్ల గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. భారీ వర్షం కురవడంతో జిహెచ్‌ఎంసి అధికారలు రంగంలోకి దిగారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News