Sunday, December 22, 2024

వరుడు అక్కడ..వధువు మరెక్కడో..పెళ్లి జరిగిపోయింది !

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడడాలు, రోడ్లు కొట్టుకుపోవడాలు వంటి ప్రకృతి విపత్తులేవీ ఆ పెళ్లిని అడ్డుకోలేకపోయాయి. వధూవరులు పెళ్లి మండపానికి చేరుకోలేని పరిస్థితులైదురైనప్పటికీ ఆ వివాహం సక్రమంగా ముహూర్తం సమయానికే జరిగిపోయింది. ఇది ఎలా సాధ్యమనుకుంటున్నారా..తెలుసుకోవాలనుకుంటే హిమాచల్ ప్రదేశ్‌కు మనం వెళ్లాల్సిందే.

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు జలవిలయాన్ని చవిచూస్తున్నాయి. ముఖ్యంగా కులూ మనాలి ప్రాంతాలలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సిమ్లాలోని కోట్‌గఢ్‌కు చెందిన ఆశిష్ సింఘాకు, కులూలోని భుంతర్‌కు చెందిన శివానీ ఠాకూర్‌కు పెళ్లి ముహూర్తం దగ్గరపడింది. పెళ్లి కొడుకు సిమ్లా నుంచి కులూకు చేరుకునే పరిస్థితి కనపడడం లేదు. కొండచరియలు విరిగిరోడ్లపై పడిపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.వరదల కారణంగా రోడ్లు తెగిపోయాయి. బాహ్య ప్రపంచంతో కులూకు సంబంధాలు తెగిపోయాయి. పెళ్లి ఊరేగింపుతో ఆశిష్ సోమవారం కులూలోని భుంతర్ చేరుకోవలసి ఉంది. ఒక పక్క ఆడపెళ్లివారింట్లో పెళ్లికి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. పెళ్లి కొడుకు రాకకోసం వారంతా ఎదురుచూస్తున్నారు.

ఈ పరిస్తితులలో ఇరువైపులా పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. వివాహ వేడుకను ఆన్‌లైన్‌లో జరిపించాలని నర్ణయించుకున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వరుడు వదువు మెడలో తాళి కట్టాడు. ఈ పెళ్లిపెద్దగా తియోగ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేష్ సింఘా నిలబడ్డారు. పెళ్లి కుమారుడు రాలేని పరిస్థితుల్లో ఆన్‌లైన్ పెళ్లి అనివార్యమైందని ఆయన తెలిపారు. మొత్తానికి పెళ్లి తంతు పూర్తయ్యింది. మిగిలిన కార్యక్రమాలన్నీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిపించలేరు కాబట్టి వరద పరిస్థితి చక్కబడిన తర్వాత ఇరుపక్షాలు మళ్లీ మరో వేడుక ద్వారా ప్రత్యక్షంగా కలుసుకుంటారని ఆశిద్దాం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News