Monday, December 23, 2024

పెండింగ్ చలాన్లతో కాసుల వర్షం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :  ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు భారీ స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9.61 లక్షల చలాన్లు ఇప్పటి వరకు చెల్లించినట్లు పోలీసులు వెల్లడించారు. చలాన్ల ద్వారా రూ.8.44 కోట్ల ఆదాయం సమకూరింది. కేవలం హైదరాబాద్ పరిధిలోనే 3.54 లక్షల చలాన్ల చెల్లింపు జరిగింది. హైదరాబాద్ పరిధిలో చలాన్లతో రూ.2.62 కోట్ల ఆదాయం సమకూరింది. సైబరాబాద్ పరిధిలో 1.82లక్షల చలాన్ల చె ల్లింపు జరగగా రూ.1.80 కోట్ల ఆదాయం వచ్చింది. రాచకొండ పరిధిలో 93 వేల చలాన్ల చెల్లింపు జరగగా రూ. 76.79 లక్షల ఆదాయం వచ్చింది.

చెల్లింపుల తాకిడితో తరచూ సర్వర్ హ్యాంగ్ అవుతోం ది. పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్ ప్రకటిస్తూ మంగళవారం జివో విడుద లైంది. టూ వీలర్స్, త్రీ వీలర్స్ వాహనాలపై 80 శాతం, ఫోర్ వీలర్స్, హెవీ వెహికల్స్‌పై 60శాతం డిస్కౌంట్ ప్రకటించిం ది. ఆర్టీసి బస్సులకు ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇచ్చింది. ఈ మేరకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలాఖరుకు చలానాల సంఖ్య 2 కోట్లకు చేరు కుం దని అంచనా. ఈ నేపథ్యంలో మరోమారు రాయితీ ప్రకటించారు. నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించినవారికే ఈ రాయితీ వర్తిస్తుంది. ‘డిసెంబర్ 25 తర్వాత పడిన చలాన్లకు డిస్కౌంట్ వర్తించదు’ అయితే.. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ పెండింగ్ చలానాలపై డిస్కౌంట్ ఆఫర్ డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రాగా.. అది కేవలం డిసెంబర్ 25 తేదీ వరకు పడిన చలాన్లకు మాత్రమే వర్తించనుందని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

డిసెంబర్ 25 తర్వాత పడిన చలాన్లకు ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తించదని.. అవి 100 శాతం కట్టాల్సిందేనని తేల్చేశారు. అయితే చాలా మంది వాహనదారులు 25 తర్వాత పడిన చలాన్లపై కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉంటుందని భావిస్తున్నారని, ఈ విషయాన్ని గమనించాలని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పెండింగ్ చలాన్లను డిస్కౌంట్‌తో డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు కట్టే అవకాశాన్ని ట్రాఫిక్ పోలీసులు కల్పించారు. . దీంతో.. వాహనదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతేడాది కూడా పెండింగ్ చలానాలపై రాయితీ ఇవ్వగా.. ఏకంగా రూ.300 కోట్ల వరకు చలానాలు వసూలు కాగా.. ఈసారి 2 కోట్లకు పైగా చలానాలు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News