సిటీబ్యూరో: ప్రపంచంలో అత్యంత ఖరీదైన విలాసవంతమైన వాహనాలకు చిరునామాగా ఉన్న హైదరాబాద్ నగరంలో సంపన్న వర్గాలు వాహనా ల రిజిస్ట్రేషన్ నెంబర్ల కోసం లక్షలు వెచ్చిస్తున్నారు. సాధారణంగా అంకెల్లో పెద్ద సంఖ్య అయిన 9 అంటే ఎవరికైనా ఇష్టమే. తదునుగుణంగా ఆర్టిఏ కార్యాలయ్లో కొత్తగా రిజిస్ట్రేషన్ సిరిస్ ప్రారంభమైతే ఎస్‌యువీలు, డొమెస్టిక్ సెగ్మెంట్‌లో హైఎండ్ లగ్జరీ కారు కొనుగోలు చేసిన యజమానులు 9,99, 999, 9999 నెంబర్ల కో సం భారీగా పోడటం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణాశాఖ కార్యాలయల్లో జరుగుతున్నదే. అయితే 1989లో కొత్తగా అమల్లోకి వచ్చిన కేంద్ర రవాణా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లోని జిల్లాలకు అక్షర క్రమంలో రవాణాశాఖ రిజిస్ట్రేషన్ నెంబర్లను కేటాయించింది. అందుకు అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రంలో హైదరబాద్ జిల్లాకు 9 నుంచి 14 నెంబర్లను రాష్ట్ర రవాణాశాఖ కేటాయించింది.
ఇందులో 9 సంఖ్య సెంట్రల్ జోన్, 10 నార్త్ జోన్ ,11 ఈస్ట్ జోన్, 12 సౌత్ జోన్ 13 వెస్ట్ జోన్‌కు కేటాయించిన విషయం తెలిసిందే. అందరి చూపు 9 వైపుకాగా సంఖ్యల్లో అతి పెద్ద సంఖ్య 9 కావడంతో పాటు నగరంలోని అన్ని సంపన్న వర్గాలు నివసించే దాదాపు సెంట్రల్ జోన్ పరిధిలోకి రావడంతో సెం ట్రల్ జోన్లో ఫ్యాన్సీ సెంబర్లకు దక్షిణాది ఇతర రాష్ట్రాలో పోల్చుకుంటే భారీ ఆదాయం రావడానికి కారణం రిజిస్ట్రేషన్ సంఖ్య 9 కావడమే . ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ బి డ్డింగ్‌లో సెంట్రల్ జోన్‌లో జరిగిన టిఎస్ 9 ఈ డబ్య్లూ సిరిస్ నెంబర్లకు పలువురు పోటీ పడగా రవాణాశాఖకు రూ. 35,62,691 ఆదాయం సమకూరినట్లు జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (జెటిసి) పాండు రంగనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్పైర్ హొమ్, ఇన్‌ఫ్రా నిర్వహకులు తమ వాహన నెం. టిఎస్ 09 జిబి 9999ను ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో రూ. 9 లక్షలు చెల్లించి దక్కించుకోగా టిఎస్ జిసి 09జిసి 0009 నంబర్‌ను రూ. 8, 9000లు చెల్లించి ఎహెచ్‌ఎస్ ఆర్ట్‌హోమ్ స్టూడియో నిర్వాహకులు సొంతం చేసుకున్నారు.
అదే విధంగా టిఎస్ 09 జిసి 0001 నంబర్‌ను జ్యోతి సుప్రియా అనే వాహనదారులు రూ.2,62,113 చెల్లించి దక్కించు కో గా టిఎస్ 9జిసి 0006 నంబర్‌ను ఆన్‌లైన వేలం పా టలో నామాల పురుషోత్తమరావు రూ. 2,16000 చెల్లించగా టిఎస్ 09 జిసి 0005 అనే నంబర్‌ను కమేల్‌ష్ గ్రూప్ రెస్టాంరెంట్ నిర్వహకులు రూ. 1,45,555 చెల్లించి ఆన్‌లైన్‌లో బిడ్డింగ్‌లో సొంతం చేసుకున్నారు. టిఎస్ 09 జిసి 0007 నంబర్‌ను రూ. 1,11,112 చెల్లించి చోటా నాయిడు కామిరెడ్డి స్వాధీనం చేసుకోగా, టిఎస్ 09 జిసి 0019 నంబర్‌కు రోహన్ ఎలక్ట్రికల్ నిర్వాహకులు 1,07000 చెల్లించిగా, టిఎస్ 09 జిసి 0004నంబర్‌ను రూ. 10,6001 మొత్తాన్ని చెల్లించి ఎస్‌కె. కార్‌లాంజ్ నిర్వాహకులు దక్కించుకున్నారు . వీటితో పాటు గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్ల్‌తో కలిపి సంస్థకు మొత్తం రూ. 35, లక్షల 62 వేల,691కు వచ్చినట్లు జెటిసి పాండురంగనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.