Wednesday, January 22, 2025

భారత్‌-పాక్ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు!

- Advertisement -
- Advertisement -

చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్‌-భారత్ జట్ల మధ్య జరిగే ఆసియాకప్ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే శనివారం రోజు వర్షం పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో ఇరు దేశాల అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ప్రపంచంలోనే భారత్‌పాక్ మ్యాచ్‌కు ఎంతో ఆదరణ ఉంది.

అయితే ఇరు జట్ల నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగడం లేదు. ఐసిసి లేదా ఆసియాకప్ వంటి టోర్నమెంట్‌లలో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఎప్పుడూ మ్యాచ్ జరిగినా అభిమానులకు పండుగేనని చెప్పక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News