Sunday, December 22, 2024

భారత్-ఇంగ్లాండ్ సెమీ ఫైనల్: వర్షంతో తడిసి ముద్దైన స్టేడియం

- Advertisement -
- Advertisement -

టి20 ప్రపంచకప్ 2024లో భాగంగా ది ప్రావిడెన్స్ స్టేడియంలో గురువారం భారత, ఇంగ్లాండ్ జట్లు సెమీ ఫైనల్స్ లో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందో లేదోనని అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే.. మ్యాచ్ జరగాల్సిన ప్రాంతంలో వర్షం కురుస్తోంది. ఆకాశం అంతా మబ్బులు పట్టింది.

స్టేడియం పరిసరాల్లోనూ భారీగా వర్షం కురుస్తోంది. దీంతో స్టేడియాన్ని కవర్లతో కప్పి ఉంచారు. వర్షం కారణంగా స్టేడియం తడిసి ముద్దైంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ సమయానికి వర్షం ఆగుతుందో లేదో చూడాలి. ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే కూడా లేదు. ఒకవేళ వర్షంతో బంతి పడకుండానే మ్యాచ్ రద్దు అయితే.. భారత్ నేరుగా ఫైనల్ కు వెళ్లే అవకాశం ఉంది.

కాగా, ఈరోజు ఉదయం జరిగిన తొలి సెమిఫైలన్స్ లో ఆఫ్గానిస్తాన్ జట్టుపై సౌతాఫ్రికా 9 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతర బ్యాటింగ్ చేసిన సఫారి జట్టు 8 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యిన్ని ఛేదించి ఫైనల్ కు దూసుకెళ్లింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News