Friday, December 20, 2024

తెలంగాణలో రాగల నాలుగు రోజుల పాటు వానలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేల రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిక వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈమేరకు ఆయా జిల్లాలకు అలెర్ట్ జారీ చేశారు. ఓటర్లకు ఎండ తీవ్రత తగలకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ వర్షం వల్ల ఇబ్బంది కలిగే పరిప్థితులు కనిపిస్తున్నాయి.
సోమవారం రోజున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి,నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో గంట కు ముఫై, నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.

మంగళవారం రోజున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి,మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.బుధవారం, గురువారాల్లోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురియనున్న కారణంగా కొన్ని జిల్లాలకు ఆరేంజ్ అలెర్ట్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి,భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News