Monday, December 23, 2024

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. బైక్‌తో సహా కొట్టుకుపోయిన వ్యక్తి

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జోధ్ పూర్ లో శుక్రవారం రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జోధ్‌పూర్ నగరం లోని ప్రధాన మార్కెట్ , రైల్వేస్టేషన్ జలమయమయ్యాయి. రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. కాలనీలు, వీధులు వరద నీటితో అల్లాడుతున్నాయి. ఓవ్యక్తి బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. బైక్‌పై ఉన్న మరో ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News