Sunday, January 19, 2025

హైదరాబాద్‌లో ఈదురుగాలులతో వర్షం

- Advertisement -
- Advertisement -

Rain with gusts in Hyderabad

హైదరాబాద్: నగరంలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. గాలి దూమరానికి నాంపల్లిలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి ఎగిరొచ్చిన వచ్చిన ఇనుప రేకులు వాహనాలపై పడ్డాయి. ఈ ఘటనలో మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. చంపాపేట్, కర్మన్ ఘాట్, సరూర్ నగర్, సైదాబాద్, అంబర్ పేట్, అమీర్ పేట్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలకు  అనుకూల పరిస్థితులు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

 

Rain with gusts in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News