- Advertisement -
తిరువనంతపురం : కేరళలో భారీ వర్షాలు, వరదలతో మంగళవారం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు. తూర్పుమధ్య అరేబియా సముద్రంలో తుపాను కారణంగా కేరళలో అనేక జిల్లాలు భారీ వర్షాలు, వరదలతో జలమయమయ్యాయి. మొత్తం 14 జిల్లాల్లోని 9 జిల్లాల్లో వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పలక్కాడ్, మలప్పురం, కొజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసరగొడె జిల్లాలో ఆరంజ్ కోడ్ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. మలప్పురం జిల్లా కరిప్పూర్ సమీపాన పల్లిక్కల్ పంచాయతీలో ఇంటి బాగం కొంత కూలడంతో దియానా పాతిమా (7)లుబానా ఫాతిమా (6 నెలలు)మృతి చెందారు. వారి తల్లిదండ్రులు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొల్లాం జిల్లా తెన్మాలా వద్ద పొంగిపారే వాగులో మునిగి గోవిందరాజ్ అనే కార్మికుడు మృతి చెందాడు.
- Advertisement -